KMR: వేసవి ఉపశమనం కోసం వాడే ఎయిర్ కూలర్లు అజాగ్రత్త వల్ల ప్రాణాలు తీస్తున్నాయి. గతేడాది జుక్కల్ లోని పెద్ద గుల్లా తండాలో కూలర్ షాక్ వల్ల శివాని(14), ఆమె తల్లి శంకబాయి(34)మృతి చెందారు. తాజాగా ఈనెల 17న ఎల్లారెడ్డి మండలం హజీపూర్లో రాజిరెడ్డి(47)కూలర్ రిపేర్ చేస్తూ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు