BHPL: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మానవత్వాన్ని చాటుకున్నారు. భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి ఉన్న బసవరాజుపల్లి గ్రామానికి చెందిన సిద్ధూను ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆసుపత్రి అధికారులు, వైద్యులతో ఎమ్మెల్యే మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచనలు చేశారు.