ASF: కాగజ్ నగర్ పట్టణంలోని పలు కాలనీలలో శుక్రవారం మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టినట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. డ్రెయినేజీలలో పూడిక మట్టిని తొలగించి శుభ్రం చేశారు. కాలనీల్లో సైతం చెత్తను తొలగించామని, పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రెయినేజీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.