అన్నమయ్య: పుల్లంపేట మండలం పుల్లంగేరు బ్రిడ్జ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి గుంతల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. వెంటనే స్థానికులు పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతుడి పరిశీలించారు. మృతికి గల కారణాలు ఏమిటో తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.