MDCL: బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని అల్వాల్ సర్కిల్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జెండావిష్కరణ చేసి స్వీట్లు పంచుకున్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన నాయకులను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.