తిరుపతి: నాగలాపురం ఐసీడీఎస్ పరిధిలో 11 అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ సౌభాగ్యమ్మ తెలిపారు. గ్రామాల వారీగా రిజర్వేషన్లు కేటాయించిన ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18లోపు పిచ్చాటూరు ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూపర్ వైజర్ శ్రీదేవి సూచించారు.