MDCL: నిజాంపేట్ సర్వే నెం.109లో ప్రభుత్వ భూమిపై “రెడ్డీస్ అవెన్యూ” పేరుతో నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ శాఖ ఇప్పటికే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా పనులు ఆగకపోవడంతో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే తనిఖీలు నిర్వహించి అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలన్నారు.