ATP: కళ్యాణదుర్గంలోని వాల్మీకి కూడలిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనే స్వయంగా చీపురు పట్టి రోడ్డును శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ మున్సిపల్ కార్మికుల కష్టాన్ని గుర్తించి, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా వేరు చేసి అందిస్తూ పట్టణ సుందరీకరణకు బాధ్యతగా సహకరించాలని కోరారు.