KRNL: హోళగుంద మండలం నేరనికి తాండ గ్రామంలో ఇవాళ వ్యక్తిగత వివాదం ఘర్షణకు దారి తీసింది. రాఘవేంద్ర నాయక్ గొడ్డలితో దాడి చేయడంతో రాము నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రామును ఆదోని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు రిఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.