వనపర్తి జిల్లాలోని గాంధీ చౌక్ కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అవసరాల కోసం వస్తుంటారు. మహిళలు, చిన్నపిల్లలు వస్తుంటారు. గాంధీ చౌక్ లో పబ్లిక్ టాయిలెట్స్ లేనందువల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ కమిటీ సభ్యులు భోజరాజు వనపర్తి జిల్లా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి చేశారు.