ఖమ్మం జిల్లాతో పాటు ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు సోమవారం సమీక్ష జరిపారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖమ్మం నగరంలో నిర్మాణం జరుగుతున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణంపై ఆర్ అండ్ బి అధికారులతో చర్చించారు.