TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ స్వాగతం పలికారు. కాసేపట్లో శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సీఎం పూజలు చేయనున్నారు. అనంతరం రూ.198 కోట్లతో జరిగే కాళేశ్వరం ఆలయం అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.