WGL: పర్వతగిరి మండలం అన్నారం వద్ద ఇవాళ వడదెబ్బతో హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ సీహెచ్ సుజాత అస్వస్థతకు గురయ్యారు. వరంగల్, గవిచెర్ల అన్నారం మార్గంలో రెండవ ట్రిప్పులో విధులు నిర్వహిస్తుండగా ఎండ తీవ్రతతో అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. వెంటనే స్థానికులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు.