JGL: బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. హెచ్ఎం మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సర్కారు బడుల్లోని వసతులను ఉపయోగించుకోవాలని కోరారు. సర్పంచ్ నక్క రాజవ్వ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థులు పాల్గొన్నారు.