KMM: నగరంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం సృష్టించిన BRS వారు ఇప్పుడు నీతులు చెప్పడం విచిత్రమని అన్నారు. కబ్జా చేసిన స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేసి తమకు నీతులు చెప్పడం ఏంటని ఎద్దేవా చేశారు.