BHPL: కాటారం సబ్ డివిజన్లో ఆదివారం సాయంత్రం 5:30 గంటల నుంచి BSNL సెల్ఫోన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సిగ్నల్స్ లేకపోవడంతో మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. బ్యాంకుల్లో ఇంటర్నెట్ సేవలు లేక కార్యకలాపాలు స్తంభించాయి. ఇవాళ CM పర్యటన ఉండటంతో సిగ్నల్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.