కాకినాడ 3 టౌన్ హెడ్ కానిస్టేబుల్ ధనరాజు సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం రేపింది. తన గన్తో ఛాతిపై కాల్చుకోగా.. వ్యక్తిగత కారణాలేనని తెలుస్తోంది. అయితే, పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. బదిలీ కారణం కాదని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో కింద పడిన బుల్లెట్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.