కడప: చక్రాయపేట మండలం కల్లూరుపల్లి తండా గిరిజనులకు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని కోరుతూ బంజారా స్టూడెంట్ యూనియన్ నాయకులు కడప కలెక్టరేట్లో సోమవారం డీఆర్వో వెంకటపతికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు జగన్ రాథోడ్ మాట్లాడుతూ.. 1300 జనాభా ఉన్న ఈ తండా అభివృద్ధి కోసం గతంలో ఆగిపోయిన ప్రక్రియను పునఃప్రారంభించాలని కోరారు.