TG: వేసవి ఉక్కపోత దృష్ట్యా చాలామంది ఏసీలు కొంటున్నారు. అయితే ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఏది కొనాలని కన్ఫ్యూజ్ అవుతారు. రోజుకు 5 నుంచి 6 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీ వాడేవారు కచ్చితంగా ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం బెస్ట్. ఇది నాన్ ఇన్వర్టర్ ఏసీతో పోలిస్తే.. దాదాపు 30 శాతం నుంచి 50 శాతం వరకు విద్యుత్ ఆదా చేస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్.