VSP: భీమిలిలో మైలపల్లి సతీష్ (35) అనే వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధల కారణంగా మనస్తాపం చెందిన సతీష్ చాకుతో తన చేతిని కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.