కోనసీమ: రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తపించే సీఎం చంద్రబాబు అవిశ్రాంత కృషి, పట్టుదలను మనందరం ఆదర్శంగా తీసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు కొత్తపేటలోని అన్న క్యాంటీన్లో పేదవారికి అల్పాహారం అందించారు.