NLG: దేవరకొండలోని తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో డేనియల్, ఎస్సై నారాయణరెడ్డి, ఎంపీవో సాగర్ నాయక్, మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం కళాశాలకు కల్పిస్తున్న అభివృద్ధి గురించి విద్యార్ధినిలకు వివరించారు.