ADB: ఇంటి దహనం కేసులో నిందితుడు పైటానే ధనరాజ్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రమేష్ గురువారం వెల్లడించారు. ఆస్తి వివాదం కారణంగా తన అన్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడి వద్ద పెట్రోల్ సీసా, వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.