BDK: మణుగూరు ఐఎఫ్టియు నాయకులు నాజర్ పాషా ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణుగూరు పినపాక అశ్వాపురం మండలంలో నివసిస్తున్న ఆదివాసి గిరిజన గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. వేసవి కాలంలో త్రాగునీరు అందుబాటులో లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని వాపోయారు.