SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.13 కోట్లతో ప్రభుత్వ అతిథి గృహం నుంచి బసవేశ్వర విగ్రహం వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదివారం పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఈ మార్గంలో ఐదు జంక్షన్లను ఏర్పాటు చేయాలని ఆయన హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు. పనుల నాణ్యతపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.