HNK: కమలాపూర్ మండలానికి చెందిన డాక్టర్ ఆడెపు వెంకటరమణకు అర్థశాస్త్ర ప్రొఫెసర్గా పదోన్నతి కల్పిస్తూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ బోధనా అనుభవం, విద్యా విషయక సేవలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పలువురు అధికారులు, తోటి అధ్యాపకులు వెంకటరమణకు శుభాకాంక్షలు తెలిపారు.