GDWL: అయిజలోని పరమేశ్వర ఇండస్ట్రీస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితుడు ప్రతాపరెడ్డిని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. సుమారు రూ.3 కోట్ల నష్టం వాటిల్లడంపై వారు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామని, అయిజలో త్వరలోనే అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.