KMR: సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడికి కోర్టు ఏడాది జైలు శిక్ష, ₹200 జరిమానా విధించింది. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. కేసును విజయవంతంగా చేధించిన పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.