MNCL: గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని దండేపల్లి మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి సూచించారు. శుక్రవారం దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గర్భిణీలు బాలింతలు చిన్నారులకు ఆమె ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. చిన్నారులకు కథల ద్వారా పాఠాలు బోధించాలని ఆమె కోరారు.