NRML: నిర్మల్ పట్టణం గొల్లపేట్లో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధ్యక్షతన డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు. దేశంలో రాజ్యాంగ రక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.