BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గురువారం ఉదయం 10:30 గంటలకు గుండాలలో స్థానిక రైతు వేదికలో మండల స్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో డి.బాలరాజు తెలిపారు. ప్రభుత్వ పథకాలపై అధికారులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పొదుపు సంఘాల మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.