MBNR: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడుతుందని దేవరకద్ర శాసనసభ్యులు జీ. మధుసూదన్ రెడ్డి అన్నారు. కౌకుంట్ల మండల కేంద్రంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ గ్రేడ్ రకం సన్నబియ్యానికి రూ. 2389, సాధారణ రకం సన్న బియ్యం క్వింటాలకు రూ. 2350 రూపాయల మద్దతు ధర ఇస్తున్నట్టు వెల్లడించారు.