RR: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఇటీవల మోయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు, నూతన పాలకవర్గానికి మంత్రి అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నారు.