MNCL: నెన్నెల మండలం శ్రావణపల్లి అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రహస్యంగా దాచి ఉంచిన 1600కేజీల బెల్లం, 15 KGల పటికను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ CI హరి వెల్లడించారు. బట్టీలను ధ్వంసం చేసి 200 లీటర్ల బెల్లం పానకాన్ని ఒంపేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.