NGKL: కుమ్మెర ఘటన నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం సమర్పించారు. జాతర ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్న సర్పంచ్ తుకారం రెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలోని ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయాలని కోరారు.