MNCL: జన్నారం మండలంలో చేపట్టిన అభివృద్ధిపై మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. ప్రజా పాలన-అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఉదయం 9:30 గంటలకు జన్నారం మండల కేంద్రంలోని పోన్కల్ రైతు వేదికలో మండల సమావేశం ఉంటుందన్నారు. ఇందులో సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు పాల్గొనాలని ఆయన కోరారు.