BHPL: జిల్లాలో మే 1వ తేదీ నుండి 10 వరకు మేడే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కార్మిక శాఖ, ఉపాధి, ఫ్యాక్టరీ శాఖలు కలిసి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతాయి. ఉత్తమ సేవలందించిన అధికారులు, కర్మాగారాల అవార్డుల కోసం ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను సహాయ కార్మిక అధికారికి సమర్పించాలని సూచించారు.