ADB: జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సదస్సులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. వేసవి తీవ్రత దృష్ట్యా త్రాగునీటి సమస్య తలెత్తకుండా RWS అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.