SRPT: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపుతోందని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకన్న, జిల్లా కార్యదర్శి నజీర్ విమర్శించారు. ప్రజలపై విధించిన భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం సూర్యాపేట ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.