SRPT : చాకిరాల-రామాపురం మార్గంలో ఏర్పడిన భారీ గుంత వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన బీజేపీ నేత వీరన్న, గ్రామస్తులతో కలిసి అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గతంలో ఆందోళనలు చేసినా అధికారుల నిర్లక్ష్యం వీడలేదని, ప్రాణనష్టం జరగకముందే అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.