KMR: దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఉన్నందున ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి ముగ్గురు డాక్టర్లను త్వరలో ఆస్పత్రి నియమిస్తామని తెలిపారు.