BHPL: కాటారంలోని ఓ హైస్కూల్లో ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ సూచనలు పాటించే అవసరం వివరించారు. సైబర్ మోసాల నుంచి జాగ్రత్తలు, సీసీ కెమెరాల ప్రయోజనం గురించి తెలిపారు. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గి సురక్షిత ప్రయాణం సాధ్యమని సూచించారు.