KMM: డిప్యూటీ సీఎం భట్టి నేడు మధిర నియోజకవర్గంలో పర్యటిస్తారని వారి వ్యక్తిగత సహాయకులు భాస్కర్ శర్మ తెలిపారు. ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీతో పాటు కట్టలేరు ఆనకట్ట ఆధునీకరణ, బీటీరోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. అలాగే మధిరలో నూతనవిద్యుత్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు.