GDWL: పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించనున్న జార్జ్ రెడ్డి వర్ధంతి సభను జయప్రదం చేయాలని ఆ సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు హరీశ్ పిలుపునిచ్చారు. శనివారం మల్దకల్ ఎస్సీ బాలుర వసతి గృహంలో సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా అరుణతార జార్జ్ రెడ్డి పీడీఎస్యూను స్థాపించి, విద్యార్థి ఉద్యమంలో నూతన చైతన్యాన్ని నింపారన్నారు.