MDK: రేగోడ్ మండలం సిందోల్ శివారులో చింతచెట్టు నీడన సాగుతున్న జూదక్రీడపై శనివారం పోలీసులు మెరుపుదాడి చేశారు. SI పోచయ్య బృందం విశ్వసనీయ సమాచారంతో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది. పోలీసుల రాకను గమనించిన ముగ్గురు నిందితులు చాకచక్యంగా పరారయ్యారు. ఘటనా స్థలం నుండి రూ.78వేల నగదు, 6 సెల్ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.