BHNG: జేతురం తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. తండాలో నూతనంగా మంజూరైన రేషన్ షాపును సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ శనివారం ప్రారంభించారు. గతంలో జేతురం, సంగ్య, మామిడికుంట తండాల ప్రజలు రేషన్ బియ్యం కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న ములకలపల్లికి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు సొంత గ్రామంలోనే సౌకర్యం కలగడంపై హర్షం వ్యక్తం చేశారు.