KMM: కామేపల్లి పోలీస్ స్టేషన్ను మంగళవారం అడిషనల్ DCP లా, ఆర్డర్ ప్రసాద్ రావు సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, CCTNS అప్లోడ్, జనరల్ డైరీ రికార్డులను, సీజ్ చేసిన వాహనాలు, పరిసరాలను DCP పరిశీలించారు. గ్రామాలలో క్షేత్రస్థాయిలో అవగాహన ఉండాలని సెక్టార్ పోలీస్ ఆఫీసర్లకు సూచించారు. అటు వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.