NZB: ధర్పల్లి మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://tgms.telangana.gov.in నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.