సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వనపర్తి కలెక్టరేట్‌ను ఆశాకార్యకర్తలు ముట్టడించారు. అనంతరం నిర్వహించిన ధర్నాకార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు రమేష్, మండ్ల రాజు మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దగాపడ్డ ఆశవర్కర్లు కాంగ్రెస్‌పై ఆశలు పెంచుకొని ఎన్నికలలో మద్దతు ఇచ్చిన ఆశవర్కర్ల హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని విమర్శించారు.