SRPT: అనంతగిరి గ్రామంలో ప్రధాన రహదారిపై తాగునీటి సరఫరా చేసే ప్రధాన పైప్లాన్ పగిలింది. దీంతో భారీగా నీరు రోడ్డుపై వృథాగా పోతుంది. ఈ కారణంగా గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉంది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పైప్లాన్ మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.